News November 9, 2024

అందుకే ఇంకా ఇండియాలో ఉంటున్నా: నటాషా

image

తన కుమారుడు అగస్త్య కోసమే తానింకా ఇండియాలోనే ఉంటున్నట్లు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ తెలిపారు. అగస్త్యను వదిలి సెర్బియా వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ‘హార్దిక్, నేను విడిపోయినా అగస్త్య కోసం కుటుంబంగానే ఉంటున్నాం. అతడు మా ఇద్దరి ప్రేమ పొందాలనుకుంటున్నాడు. అగస్త్య నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక తల్లికి తనకొడుకు సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Similar News

News January 29, 2026

రేపు రాలేను, ఎర్రవల్లి ఫాంహౌస్‌కు రండి: కేసీఆర్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ బదులిచ్చారు. ముందే షెడ్యూల్ అయిన మున్సిపల్ ఎలక్షన్ కార్యక్రమాల వల్ల రేపు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే విచారించాలని విచారణ అధికారిని కోరారు. మాజీ సీఎంగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే నోటీసులను కూడా ఎర్రవల్లికే పంపాలని పేర్కొన్నారు.

News January 29, 2026

ప్రధానిగా మోదీనే బెస్ట్: ఇండియా టుడే సర్వే

image

భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. 6 నెలల కిందటితో పోలిస్తే 3% పెరిగినట్లు తెలిపింది. మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, గుడ్ రేటింగ్ ఇచ్చారని వివరించింది. యావరేజ్ అని 16%, పూర్ అని 24% మంది అభిప్రాయపడ్డారని చెప్పింది. మరోవైపు బెస్ట్ సూటెడ్ PM అంటూ రాహుల్ గాంధీ వైపు 27% మంది మొగ్గు చూపినట్లు పేర్కొంది.

News January 29, 2026

పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు: రహానే

image

T20 ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్‌పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.