News February 25, 2025
అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లారు: పురందీశ్వరి

AP: ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి అన్నారు. అందుకే నిన్న జగన్ సభకు వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని విమర్శించారు. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను జగన్ మరిచిపోవడం సరికాదని చురకలు అంటించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. వైసీపీ పాలనలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిందని దుయ్యబట్టారు.
Similar News
News November 22, 2025
AP న్యూస్ అప్డేట్స్

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.
News November 22, 2025
భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.
News November 22, 2025
ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.


