News March 29, 2024
అందుకే కేజ్రీవాల్ ఫోన్ కావాలంటున్నారు: అతిశీ

ఈడీని BJP పొలిటికల్ వెపన్‌లా వాడుకుంటోందని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘కేజ్రీవాల్ ఫోన్‌లో ఏముందో తెలుసుకోవాలని BJP అనుకుంటోంది. లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఆయన వాడిన ఫోన్ తమకు లభించలేదని ఈడీ గతంలో చెప్పింది. ఇప్పుడేమో ఆయన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పట్లేదని అంటోంది. ఫోన్‌లోని వివరాల కోసం కస్టడీని పొడిగించాలని కోరింది. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకునేందుకే ఇలా చేస్తోంది’ అని అన్నారు.
Similar News
News April 19, 2026
CUET UG-2026.. మరొకొన్ని గంటలే ఛాన్స్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG-2026) సబ్జెక్ట్ కరెక్షన్ విండో నేటితో ముగియనుంది. CUET, <
News April 19, 2026
T2OI కెప్టెన్‌గా శ్రేయస్?

T2OI కెప్టెన్‌గా సూర్యను తొలగించాలనుకుంటే సెలక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. IPLలో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతోపాటు T20 క్రికెట్‌లో నాలుగో స్థానంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని పేర్కొంది. పంత్, గిల్ పోటీలో ఉన్నప్పటికీ అయ్యర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు రాసుకొచ్చింది. సూర్యకు కెప్టెన్‌గా మంచి మార్కులు ఉన్నా ఆటగాడిగా ఫెయిలవుతున్నారు.
News April 19, 2026
తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

AP CM చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. NDA అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే CBN ప్రచారం సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. TNలో ఏప్రిల్ 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


