News September 28, 2024
అందుకే ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలు కూల్చలేదు: రంగనాథ్

TG: ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు రక్షించడమే దాని లక్ష్యమని, పేదలను ఇబ్బంది పెట్టడం కాదన్నారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చెరువులు, నాలాలను కాపాడుకోలేం. కోటి మంది బాధితులుగా మిగులుతారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలు కూల్చలేదు. జన్వాడ ఫామ్హౌజ్ హైడ్రా పరిధిలో లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
KNR: పీఎఫ్, డిపాజిట్లపై అవగాహన ముఖ్యం: కమిషనర్

క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ కేవైసీ, ఫోన్ నంబర్, అడ్రస్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.
News November 1, 2025
సానుభూతితో ఓట్లు దండుకోవాలనేది BRS యత్నం: రేవంత్

TG: జూబ్లీహిల్స్లో సానుభూతితో ఓట్లు దండుకోవాలని BRS ప్రయత్నిస్తోందని CM రేవంత్ ఆరోపించారు. ‘2007లో PJR చనిపోతే ఏకగ్రీవం కాకుండా అభ్యర్థిని నిలబెట్టే సంప్రదాయానికి KCR తెరదీశారు. పదేళ్ల పాటు మైనార్టీ సమస్యలు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70వేల ఉద్యోగాలిచ్చాం. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన KTR.. సునీతను బాగా చూసుకుంటారా?’ అని విమర్శించారు.
News November 1, 2025
రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలి: ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రేపటిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేశ్ బాబు డిమాండ్ చేశారు. లేకపోతే ఎల్లుండి నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిరవధిక బంద్ చేస్తాయని హెచ్చరించారు. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని యాజమాన్యాలను కోరుతున్నామన్నారు. కాలేజీలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు.


