News May 1, 2024
రేవంత్ అందుకే విచారణకు రాలేదు: టీపీసీసీ లీగల్ సెల్

TG: ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల నోటీసులకు TPCC లీగల్ సెల్ సమాధానమిచ్చింది. CM రేవంత్‌కు వచ్చిన నోటీసులపై 4 వారాల గడువు కోరింది. ఎన్నికల ప్రచారంలో ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారని, ప్రచార షెడ్యూల్ కారణంగా ఈరోజు విచారణకు హాజరు కాలేదని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులిచ్చారు. ఆమె అమిత్ షా వీడియోను ఎడిట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.
Similar News
News April 2, 2026
ఇటలీకి హ్యాట్రిక్ షాక్!

ఫుట్‌బాల్ ప్రపంచకప్ హిస్టరీలో నాలుగుసార్లు (1932, 1938, 1982, 2006) ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ ఇప్పుడు క్వాలిఫికేషన్‌కే తడబడుతోంది. 2018, 2022తో పాటు ఇప్పుడు లేటెస్ట్‌గా మరోసారి ఆ జట్టు అర్హతను సాధించలేకపోయింది. ప్రత్యర్థి బోస్నియాను తక్కువ అంచనా వేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇతర స్టార్ జట్లు చిలీ, పోలాండ్, నైజీరియా, కోస్టారికా కూడా అర్హత సాధించలేకపోయాయి. JUN 11 నుంచి WC ప్రారంభంకానుంది.
News April 2, 2026
రూ.1,000కోట్లు ఇచ్చేదాకా వైద్యం బంద్: ఆషా

NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల బంద్ కొనసాగనుంది. నిన్న ప్రభుత్వం, AP స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆషా) మధ్య చర్చలు జరిగాయి. రూ.3వేల కోట్లు ఇవ్వాలని ఆషా డిమాండ్ చేయగా, బకాయిలు రూ.2,100కోట్లే ఉన్నాయని ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్ తెలిపారు. 2 వారాల్లో రూ.1,000కోట్లు, ప్రతినెలా రూ.250కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా రూ.1,000కోట్లు ఇచ్చే వరకు బంద్ కొనసాగుతుందని ఆషా తెలిపింది.
News April 2, 2026
బరువు తగ్గాలా? సమ్మర్ బెస్ట్..!

వెయిట్ లాస్ కావడానికి వేసవి మంచి సీజన్. చలి, వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో ఉదయం త్వరగా నిద్ర లేవచ్చు. వాకింగ్, రన్నింగ్‌కు వెళ్తే చెమట ద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్‌సైజ్. వేడి వాతావరణం, వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆకలి వేయదు. ఇది ఒకరకంగా బరువు పెరగకపోవడానికి దోహదపడుతుంది. ఈ సీజన్‌లో లభించే పుచ్చ, నారింజ, దోస, కొబ్బరినీళ్లు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.


