News September 22, 2024
అందుకే శ్యామలరావును ఈఓగా నియమించా: చంద్రబాబు

AP: TTD ప్రక్షాళన కోసం శ్యామలరావును ప్రత్యేకంగా నియమించినట్లు CM చంద్రబాబు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యతను దేవుడు తనకిచ్చాడని చెప్పారు. ‘ఘుమఘులాడాల్సిన శ్రీవారి లడ్డూ పేలవంగా మారింది. మూడు రోజులకే చెడిపోతోంది. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రసాదాన్ని కల్తీ చేశారు. అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. రూ.319కి కిలో నెయ్యి కొన్నారు. ఆ ధరకు వనస్పతి, పామాయిల్ కూడా రాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 3, 2026
దేశ భద్రత గురించే నేను మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీ

చైనాతో సరిహద్దు వివాదంపై నిన్న పార్లమెంటులో చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశ భద్రత గురించే తాను మాట్లాడుతున్నానని.. నిన్న సభలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు.
News February 3, 2026
కల్తీ నెయ్యి కేసు.. విచారణ కమిషన్‌కు మంత్రివర్గం నిర్ణయం

AP: కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించారు. సిట్ కేవలం పాత్రధారులపైనే సిఫార్సు చేసిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. విచారణ, ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో తేడాలు ఉన్నాయన్నారు. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అడ్వకేట్ జనరల్‌ను న్యాయ సలహా కోరారు. ఆయన సూచన మేరకు ఈ అంశంలో ముందుకెళ్లే అవకాశం ఉంది.
News February 3, 2026
US-భారత్ ట్రేడ్ డీల్.. కేంద్రం క్లారిటీ

అమెరికాతో ట్రేడ్ డీల్ నుంచి కీలక రంగాలైన వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులను కేంద్రం మినహాయించనున్నట్లు తెలుస్తోంది. రైతుల విషయంలో రాజీ పడేది లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ ఒత్తిడితోనే భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు అంగీకరించిందన్న వార్తను తోసిపుచ్చాయి. గతంలో ఆ దేశంపై ఆంక్షలు ఉండటం వల్లే ఆయిల్ కొనలేదని, ఇప్పుడు అవి లేనందున కొనుగోలుకు సిద్ధపడుతున్నట్లు తెలిపాయి.


