News October 24, 2024
అందుకే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారు: జగన్

AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో CM చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్లలో డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే DGPని పంపారు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఒక్క మంత్రి కూడా రాడు’ అని మండిపడ్డారు.
Similar News
News January 28, 2026
MBNR: పుర పోరు..అభ్యర్థుల డిపాజిట్ ఇలా..!

ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో పోటీచేసే SC,ST,BC అభ్యర్థులు రూ.1,250,ఇతరులు రూ.2,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లలో పోటీచేసే రిజర్వ్డ్ కేటగిరీఅభ్యర్థులు రూ.2,500, జనరల్ రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు పొందే అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు తప్పనిసరిగా కుల ధ్రువీకరణపత్రాన్ని జతచేయాలి.
News January 28, 2026
ఈ ఉంగరం ధరిస్తే..

జ్యోతిషం ప్రకారం పుష్పరాగం ఎంతో పవిత్రమైనది. ఈ రత్నం గురు గ్రహానికి ప్రతీక. జ్ఞానం, సంపద, సంతోషకర వివాహ జీవితం కోసం దీన్ని ధరిస్తారు. మహిళలకు వివాహ జాప్యం తొలగడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం ఇది బాగా పనిచేస్తుందని నమ్మకం. పగుళ్లు లేని, పారదర్శకమైన బంగారు రంగు పుష్పరాగం ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, దైవానుగ్రహం లభిస్తుందట. జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు.
News January 28, 2026
NIT కాలికట్లో అప్రెంటిస్ పోస్టులు

<


