News July 20, 2024
ఆ కారణం వల్లే క్రాష్ అయ్యాయి: సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అవడంపై ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ట్విటర్లో వివరణ ఇచ్చారు. ‘సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్టైక్ నిన్న ఓ అప్డేట్ రిలీజ్ చేసింది. అదే క్రాష్‌కు కారణం. సమస్యను గుర్తించాం. కస్టమర్స్‌కు సాంకేతిక గైడెన్స్ అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచ చరిత్రలోనే ఇది అతి పెద్ద సంక్షోభం. త్వరలోనే పరిష్కరిస్తాం’ అని తెలిపారు. అటు క్రౌడ్‌స్ట్రైక్ కూడా కస్టమర్స్‌కు సారీ చెప్పింది.
Similar News
News October 21, 2025
ఇలా చేయడం అమంగళకరం

కొన్ని అలవాట్లు, చర్యలను మానకపోతే జీవితంలో అశుభాలు కలుగుతాయని మన సంస్కృతి చెబుతోంది. నాలుక తడితో బొట్టు పెట్టుకోవడం, కాళ్లు దాటి వెళ్లడం, వడ్డించినా భోజనానికి రాకపోవడం, కంచాన్ని ఒళ్లో పెట్టుకొని తినడం, కాళ్లు ఊపడం, స్నానం చేసిన తర్వాత విడిచిన దుస్తులనే వేసుకోవడం, బొట్టు పెట్టుకోకపోవడం వంటి కొన్ని పనులు దోషప్రదమని పండితులు చెబుతున్నారు. వీటిని వీడితే జీవితంలో సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు.
News October 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 42

1. వాలి ఎవరి అంశతో జన్మించాడు?
2. కర్ణుడి అంత్యక్రియలను ఎవరు నిర్వహించారు?
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత ఎవరు?
4. త్రిమూర్తులలో ‘లయకారుడు’ ఎవరు?
5. వాయు లింగం ఏ ఆలయంలో ఉంది?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 21, 2025
ఇంటర్‌తో 7,565 పోస్టులు.. అప్లైకి నేడే లాస్ట్ డేట్

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి నేడే లాస్ట్ డేట్. 18-25 ఏళ్ల వయసున్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. డిసెంబర్ /జనవరిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: https://ssc.gov.in/