News October 27, 2025

పిలవని పేరంటానికి అందుకే వెళ్లొద్దంటారు

image

పిలవని పేరంటానికి వెళ్లడం ఆపదనే తెస్తుందనడానికి సతీదేవి కథే నిదర్శనం. దక్షుడు యాగానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో సతీదేవి భర్త శివుడి మాటను కాదని, బలవంతంగా ఆ యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం చూసి, ఆ అవమానాన్ని భరించలేకపోయింది. యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. పిలవని చోటికి వెళ్లడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ ఘటన మనకు చెబుతోంది.<<-se>>#Shakthipeetham<<>>

Similar News

News October 27, 2025

ప్రాణాంతక ‘కుందేటి వెర్రి వ్యాధి’.. చికిత్స

image

రక్త పరీక్ష ద్వారా పశువుల్లో కుందేటి వెర్రి వ్యాధిని గుర్తిస్తారు. వెటర్నరీ డాక్టర్ల సూచన మేరకు పశువు శరీర బరువును బట్టి, సురామిన్, క్వినాపైరమిన్‌, డైమినాజిన్ అసేట్యూరేట్, ఐసోమోటాడియమ్ క్లోరైడ్ ఇంజెక్షన్లను వాడవచ్చు. అలాగే వ్యాధి సోకిన పశువులను విడిగా ఉంచాలి. షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు కుట్టకుండా తెరలను ఉపయోగించాలి. పశువులకు శుభ్రమైన నీరు, మేత అందించాలి.

News October 27, 2025

కార్తీక సోమవారం: శివుణ్ని ఎలా పూజించాలంటే?

image

కార్తీక మాసంలో సోమవారానికి అత్యంత విశిష్టత ఉంది. ఈరోజు పొద్దున్నే లేచి, చన్నీటి స్నానం చేసి, దీపారాధన చేయాలి. నిత్య పూజానంతరం కార్తీక పురాణం పఠించాలి. ఫలితంగా విశేష ఫలితాలుంటాయి. భక్తులు శివుడిని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుంది. ‘హర హర మహాదేవ శంభో శంకర’ నామస్మరణ చేస్తూ శివాలయాన్ని సందర్శించాలి. సోమవారం చంద్రుడికి ప్రీతికరమైనది కాబట్టి, చంద్రుడిని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది.

News October 27, 2025

మొంథా ఎఫెక్ట్ .. TGలో రేపు అత్యంత భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తెలంగాణపైనా తీవ్ర ప్రభావం చూపనుందని IMD తెలిపింది. రేపు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. HYD, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడే చాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.