News June 26, 2024
‘భారతీయుడు’ను అందుకే 2 పార్టులుగా తీస్తున్నాం: శంకర్

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ డైరెక్షన్లో వచ్చే నెల 12న రానున్న సినిమా ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’కి కొనసాగింపుగా వస్తున్న 2 సీక్వెల్స్‌లో ఇది మొదటిది. దీన్ని 2 భాగాలుగా తీయడం వెనుక కారణాన్ని శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీక్వెల్‌ను ఒక పార్ట్‌గానే తీయాలనుకున్నాం. షూటింగ్ పూర్తయ్యాక చూస్తే ప్రతి సీన్ అద్భుతంగానే ఉంది. ఏ సీన్నూ తొలగించలేం. అందుకే 2 పార్టులుగా తెస్తున్నాం’ అని చెప్పారు.
Similar News
News January 21, 2026
హైదరాబాద్‌లోని NIRDPRలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)లో 4 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ(బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సోషల్ సైన్సెస్/ డెవలప్మెంట్ ఎకనామిక్స్/ రూరల్ డెవలప్మెంట్/ మేనేజ్మెంట్/సోషల్ వర్క్), B.Tech, M.Tech/MCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్సైట్: http://career.nirdpr.in//
News January 21, 2026
ప్చ్.. మాఘ మాసం వచ్చినా!

పెళ్లిళ్లతో కళకళలాడే మాఘమాసం ఈసారి ముహూర్తాలు లేక వెలవెలబోతోంది. గతేడాది NOV 26 నుంచి FEB 17(2026) వరకు మూఢం ఉండటమే ఇందుకు కారణం. శాస్త్రాల ప్రకారం మూఢంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం. అందుకే ఈ ఏడాది మాఘమాసం మొత్తం పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. తిరిగి FEB 19 (ఫాల్గుణ మాసం) తర్వాతే కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లి కావాల్సిన యువతీయువకులు ఉగాది వరకు వేచి చూడక తప్పదని జ్యోతిషులు వివరిస్తున్నారు.
News January 21, 2026
లిక్కర్ స్కామ్ కేసు.. ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ తిరస్కరణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ తిరస్కరించింది. దాని కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్‌పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టేసేంత వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఉంటుందని కోర్టు వెల్లడించింది.


