News December 22, 2024

అందుకే వైభవ్‌ను కొనుగోలు చేశాం: సంజూ శాంసన్

image

13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని IPL వేలంలో రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేయడం వెనుక కారణాన్ని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఆస్ట్రేలియా-భారత్‌ అండర్-19 టెస్టు మ్యాచ్‌ను మా మేనేజ్‌మెంట్ ప్రత్యక్షంగా చూసింది. చాలా తక్కువ బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇలాంటి ఆటగాడు కచ్చితంగా మాకు ఉండాలని భావించాం. జైస్వాల్, పరాగ్, జురెల్ వంటి ఆటగాళ్లనూ ఇలాగే గుర్తించాం’ అని తెలిపారు.

Similar News

News December 22, 2024

భారత్ భారీ స్కోరు

image

వెస్టిండీస్‌పై T20 సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత మహిళల జట్టు తొలి వన్డేలో అదే జోరును కొనసాగిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన 91 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నారు. హర్లీన్(44), ప్రతీక(40), హర్మన్ ప్రీత్(34) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జేమ్స్ 5, మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. WI టార్గెట్ 315.

News December 22, 2024

ఆ అవకతవకల్లో నా ప్రమేయం లేదు: మాజీ క్రికెటర్

image

తనపై <<14941111>>నమోదైన కేసుపై<<>> మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. తాను పెట్టుబడి పెట్టాననే కారణంతోనే సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్‌ పదవి తనకు ఇచ్చారని చెప్పారు. అయితే తానెప్పుడూ ఆ సంస్థలో యాక్టివ్‌గా లేనని తెలిపారు. కొన్నేళ్ల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఎఫ్ నిధుల అవకతవకల్లో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

News December 22, 2024

దురుసుగా ప్రవర్తిస్తే బౌన్సర్ల తాట తీస్తాం: సీపీ

image

TG: పబ్లిక్‌తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఎక్కడైనా బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. జనాలను తోయడం, కొట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బౌన్సర్ల నియామకంలో జాగ్రత్త వహించాలి’ అని సీపీ హెచ్చరించారు.