News October 1, 2024
అందుకే ‘లులు’ కంపెనీని వద్దన్నాం: బొత్స

AP: ‘లులు’ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చే స్థలం విలువ రూ.1,300 కోట్లు ఉందని, కానీ ఆ సంస్థ రూ.600 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతుందని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గతంలో లులు కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పామన్నారు. ‘రూ.99కే మద్యం ఇవ్వడం కాదు. నిత్యావసరాల రేట్లు తగ్గించాలి. 2.50 లక్షల మంది వాలంటీర్లను తప్పించారు. మద్యం షాపుల్లో పనిచేసే 15 వేల మంది సిబ్బందిని తీసేశారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 66 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 14, 2025
వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.
News November 14, 2025
వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.


