News April 25, 2024

అందుకే ఓడిపోయాం: KCR

image

తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల ప్రజలను ఆదుకున్నామని KCR అన్నారు. ‘మేం అన్ని రకాల స్కీములు తెచ్చాం. ప్రజల కడుపు నింపాం. అయితే.. కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. వాటిని నమ్మి 2-3శాతం ప్రజలు అటువైపు చేయి చాచారు. కాంగ్రెస్ కూడా మరికొన్ని అదనంగా ఇస్తుందనే ఉద్దేశంతో అటువైపు ఓట్లు వేశారు. అందుకే మేం ఓడిపోయాం. మేం మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని కేసీఆర్ అన్నారు.

Similar News

News January 13, 2026

రాహుల్ విపక్ష నేత కాదు పర్యాటక నేత: షెహజాద్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయన ఎప్పుడూ సెలవుల మూడ్ లోనే ఉంటారు. కీలకమైన జాతీయ సమస్యల సమయంలోనూ విదేశాల్లోనే గడుపుతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పర్యాటక నాయకుడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్ అపరిపక్వ నాయకుడని విమర్శించారు. కాగా వియత్నాం పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ, INC ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

News January 13, 2026

PSLV-C62 విఫలం.. అయినా పని చేసింది!

image

ఇస్రో చేపట్టిన PSLV-C62 ప్రయోగం <<18833915>>విఫలమైన<<>> విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ ఉపగ్రహం వేరుపడి, పని చేసింది. తమ కెస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్‌స్ట్రేటర్ (KID) క్యాప్సుల్ 3 నిమిషాల కీలక డేటాను పంపిందని స్పానిష్ స్టార్టప్ ‘ఆర్బిటల్ పారాడిజం’ ప్రకటించింది. ఫుట్‌బాల్ సైజులో ఉన్న 25 కిలోల క్యాప్సుల్ PSLV స్టేజ్-4లో విజయవంతంగా సపరేట్ అయింది. నిజానికి మూడో దశలోనే రాకెట్ <<18834317>>విఫలమవ్వడం<<>> గమనార్హం.

News January 13, 2026

ఫ్రెషర్లకు ₹18-22 లక్షల ప్యాకేజీ

image

HCLTech ఫ్రెషర్ల వేతనాల్లో భారీ పెంపును ప్రకటించింది. AI, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలున్న ఇంజినీర్లను ‘ఎలైట్ క్యాడర్’గా పరిగణిస్తూ వారికి ఏడాదికి ₹18-22 లక్షల వరకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. సాధారణ ఫ్రెషర్ల వేతనం కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ. HCLTech మాత్రమే కాకుండా ఇన్ఫోసిస్ కూడా నైపుణ్యం కలిగిన ఫ్రెషర్లకు ₹21 లక్షల వరకు అందిస్తోంది. ఈ ఏడాది HCLTech ఇప్పటికే 10,032 మంది ఫ్రెషర్లను తీసుకుంది.