News April 12, 2025
అందుకే వైసీపీ పతనమైంది: మంత్రి ఆనం

AP: వ్యవస్థలను నాశనం చేసింది కాబట్టే వైసీపీ పతనమైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. తమ ఎంపీలను పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కొట్టించిందన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయదని చెప్పారు. మరోవైపు టీటీడీ గోశాలలో గోవులు మరణించాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Similar News
News April 4, 2026
భూమి లాంటి గ్రహాలు 45 ఉన్నాయట!

మన సౌర వ్యవస్థ వెలుపల జీవనానికి అనువైన 45 గ్రహాలు ఉన్నాయని కార్నెల్ వర్సిటీ(US) సైంటిస్టులు గుర్తించారు. నాసా వద్ద ఉన్న 6Kకు పైగా గ్రహాల సమాచారాన్ని బట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి ప్లానెట్ నక్షత్రం నుంచి ఎనర్జీని ఎలా పొందుతుందో పరిశీలించారు. ఉపరితలంపై ద్రవ రూపంలో నీరుండటానికి ఇదొక కీలక అంశం. వీటిలో TRAPPIST-1 అనే గ్రహం 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
* light-year=9.46 trillion kilometers
News April 4, 2026
ఆరెంజ్ క్యాప్‌తో హిట్‌మ్యాన్

IPL: ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్ సాధించారు. ఢిల్లీపై బ్యాటింగ్ అనంతరం ఇంటర్వ్యూలో ఆ క్యాప్ ధరించారు. హిట్‌మ్యాన్ రెండు మ్యాచుల్లో కలిపి 56.50 సగటుతో 113 రన్స్ చేశారు. రోహిత్ తర్వాత కనోలి (108), రఘువంశీ (103), ఇషాన్ (94) ఉన్నారు.
News April 4, 2026
రాఘవ్ చడ్ఢా రాజ్యసభ సభ్యత్వం పోతుందా?

రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆప్ ఇప్పుడు ఆయన్ను MPగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ఎంపీని తొలగించే హక్కు పార్టీకి ఉండదు. పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేసినా రాజ్యసభ సభ్యత్వం కొనసాగుతుంది. 6 ఏళ్లు సభ్యుడిగా టర్మ్ పూర్తి చేయొచ్చు. విభేదాలున్నా సరే ఆప్ నుంచి రాఘవ్ చడ్ఢాను ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


