News August 22, 2025

అందుకే మీకు ప్రతిపక్ష హోదా రాలేదు: ఆనం

image

AP: హిందూ ధర్మాన్ని విమర్శించడమే వైసీపీ తన పనిగా పెట్టుకుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ‘హిందువులపై రాజకీయ క్రీడ నడపాలనుకోవడం దుర్మార్గం. ఆలయాలు, పాలక మండళ్లు, దేవదాయశాఖపై విషం చిమ్ముతారా? అసత్యాలతో వైసీపీ చేస్తున్న వికృత క్రీడను దేవుడు సైతం క్షమించడు. దేవుళ్లనూ దోచుకున్నందుకే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దేవదాయశాఖలో దాదాపు 500ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు.

Similar News

News August 22, 2025

లిక్కర్ స్కాం.. సిట్ విచారణలో నారాయణస్వామి ఏమన్నారంటే?

image

AP: లిక్కర్ స్కాం కేసులో తనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దని మాజీ Dy.CM నారాయణస్వామి కోరారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు పుత్తూరులోని ఆయన ఇంట్లో 6గంటల పాటు ప్రశ్నించారు. మద్యం ఆర్డర్స్‌లో మాన్యువల్ విధానం ఎందుకు తీసుకొచ్చారు? తదితర ప్రశ్నలను సిట్ అడిగినట్లు సమాచారం. మద్యం పాలసీలో మార్పుల గురించి తనకేం తెలియదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మిగతా ప్రశ్నలనూ దాటవేసినట్లు సమాచారం.

News August 22, 2025

కరెన్సీ నోట్లపై గాంధీని బాగానే గుర్తుపడతారు: HC

image

TG: ఇటీవల HYDలో జరిగిన విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని HC జడ్జి జస్టిస్ నగేశ్ ప్రశ్నించారు. స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేకపోయామన్న <<17483930>>పిటిషనర్ వాదన<<>>కు.. కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని బాగానే గుర్తుపడతారని చురకలంటించారు. మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయన్నారు. ఒకరినొకరు నిందించుకోవడం ఆపి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.

News August 22, 2025

‘Mega158’ కాన్సెప్ట్ పోస్టర్ చూశారా?

image

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేళ డైరెక్టర్ బాబీతో తీస్తోన్న ‘Mega158’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఆయనతో రెండో సారి కలిసి పనిచేయడం గర్వంగా ఉందంటూ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను బాబీ షేర్ చేశారు. గొడ్డలి వేటుతో రక్తపు ధార కిందకు వచ్చినట్లుగా పోస్టర్‌లో చూపించారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిరు బర్త్ డే సందర్భంగా 3 సినిమాల అప్డేట్స్ రావడం విశేషం.