News November 22, 2024
3వ అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు.. వదులుకున్న ఉక్రెయిన్!
ఇప్పుడంటే ఆయుధాల కోసం అమెరికా వద్ద చేయి చాస్తోంది కానీ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కొత్తలో ఉక్రెయిన్ వద్ద ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయుధ నిల్వలు ఉండేవి. 5వేలకు పైగా అణ్వాయుధాలు, 170కి పైగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, వార్ హెడ్స్ వంటి వాటినన్నింటినీ 1996కల్లా రష్యాకు ఇచ్చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరి, అందుకు బదులుగా స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు తెచ్చుకుంది.
Similar News
News November 23, 2024
చైతూ బర్త్డే.. ‘తండేల్’ నుంచి పోస్టర్ రిలీజ్
అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘తండేల్’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. డీగ్లామర్ రోల్లో చైతన్య కొత్తగా కనిపిస్తున్నారు. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
News November 23, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 23, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5:09
సూర్యోదయం: ఉదయం 6:25
దుహర్: మధ్యాహ్నం 12:03
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.56
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 23, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.