News September 25, 2024

మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య

image

బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య <<14192326>>కేసు<<>> నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతడి కోసం ఒడిశా వెళ్లి గాలిస్తుండగా కూలేపాడులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్‌గా ఉన్న రంజన్ కొంతకాలంగా ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండటం నచ్చక ఆమెను కిరాతకంగా చంపినట్లు సమాచారం.

Similar News

News February 9, 2026

సైలెంట్ కిల్లర్: భారత్‌లో నలుగురిలో ఒకరికి ‘ఫ్యాటీ లివర్’!

image

ఇండియా ప్రస్తుతం ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్‌ని ఎదుర్కొంటోంది. డ్రింకింగ్ అలవాటు లేకపోయినా కేవలం ఒబెసిటీ, డయాబెటిస్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ (MASLD) కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి నలుగురు అడల్ట్స్‌లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి కాలేయం గట్టిపడటం (Fibrosis) వంటి ప్రమాదకర లక్షణాలు ఇప్పటికే మొదలయ్యాయి.

News February 9, 2026

T20WC: చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్

image

T20WC-2026లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇటలీతో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 207/4 స్కోర్ చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో 200+ రన్స్ చేసిన తొలి అసోసియేట్ టీమ్‌(టెస్టు హోదా లేని జట్టు)గా చరిత్ర సృష్టించింది. గతంలో USA 197/3(vsCAN), CAN 194/5(vsUSA), NED 193/4(vsIRE) స్కోర్ చేశాయి. ఇక ఈ మ్యాచ్‌లో జార్జ్ మున్సే 84(54 B), బ్రెండన్ మెక్‌ముల్లెన్ 41(18 B), మైఖేల్ లీస్క్ 22(5 B) అదరగొట్టారు.

News February 9, 2026

మాఘ స్నానం ఇంకా చేయలేదా?

image

మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో నదీ స్నానాలు చేయాలంటారు. ఒకవేళ చేయలేకపోతే చివరి రోజు ఓ పరిహారం పాటించాలంటున్నారు పండితులు. అలా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ‘ఇంట్లో ప్రతికూల శక్తి పోవాలంటే కర్పూరంలో 11 లవంగాలు వేయాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా చూపాలి. ఆర్థిక ఇబ్బందుల తొలగింపునకు తమలపాకుపై కుంకుమపువ్వుతో ‘శ్రీ’ అని రాసి పూజ గదిలో ఉంచాలి. భార్యాభర్తలు దీపారాధన చేయాలి’ అని సూచిస్తున్నారు.