News September 11, 2024
హీరో జీవాకు యాక్సిడెంట్

తమిళ హీరో జీవా ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్ను ఢీ కొట్టింది. అడ్డుగా వచ్చిన బైక్ను తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జీవా తెలుగులో రంగం, యాత్ర-2 సినిమాల్లో నటించారు.
Similar News
News October 17, 2025
అమరావతికి స్టార్ హోటళ్ల కళ

AP: అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ప్రముఖ స్టార్ హోటళ్లు కొలువుదీరేలా ఏర్పాట్లు చేస్తోంది. దసపల్లా ₹200 కోట్లతో, SGHRL ₹177 కోట్లతో 4స్టార్ హోటళ్లను నెలకొల్పనున్నాయి. VHR సంస్థ అరకులో ₹56 కోట్లతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించడానికి ప్రతిపాదించింది. వీటికి 10 ఏళ్లవరకు SGST, 5 ఏళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
News October 17, 2025
కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టిస్తాడా?

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7 నెలల తర్వాత ఈనెల 19న AUSతో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సిరీస్లో తను వరల్డ్ రికార్డు నెలకొల్పే అవకాశముంది. 3 మ్యాచ్ల్లో ఒక్క సెంచరీ చేసినా 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా విరాట్ వన్డేల్లో 51 శతకాలు బాదారు. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును అతడు అధిగమిస్తారు.
News October 17, 2025
జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత

జపాన్ మాజీ ప్రధాని టొమిచి మురయమా(101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్గా పిలవబడే మురయమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. ఆయన 1994 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. వరల్డ్ వార్-2 సమయంలో ఆసియాలో జపాన్ చేసిన దారుణాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.