News July 21, 2024
కళ్లు కనిపించడం లేదని నటి ఆవేదన

లెన్స్ ధరించడం వల్ల కార్నియా దెబ్బతిని తన కళ్లు కనిపించడం లేదని హిందీ టెలివిజన్ నటి జాస్మిన్ భాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, మరో నాలుగైదు రోజుల్లో కోలుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కనీసం నిద్ర పోవాలన్నా కళ్ల నొప్పి వేధిస్తోందని వాపోయారు. కాంటాక్ట్ లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
ఎగ్ షెల్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ వివిధ రకాల పద్ధతులను ఎంచుకుంటారు. వాటిల్లో ఒకటే ఎగ్ షెల్ పేరెంటింగ్. ఇందులో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికీ పంపకుండా తమ వద్దే ఉంచుకుంటారు. పిల్లలు బయటకు వెళ్లి అందరితో కలిస్తేనే నైపుణ్యాలు వస్తాయి. సమస్యల్ని, సవాళ్లని తమంతట తాము పరిష్కరించుకునేలా తయారవుతారు. అన్నిట్లో తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. కాబట్టి ఇలాంటి విధానం పిల్లలకు మంచిది కాదంటున్నారు నిపుణులు.
News November 15, 2025
జూబ్లీహిల్స్ విజయం.. కాంగ్రెస్ వెంటే TDP ఓటర్లు!

TG: జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపునకు TDP ఓటు బ్యాంక్ కలిసొచ్చినట్టు తెలుస్తోంది. నవీన్ తండ్రి శ్రీశైలం యాదవ్, మాగంటి గోపీనాథ్ అప్పట్లో కోర్ TDP నేతలు. మాగంటి 2014లో TDP నుంచి గెలిచి BRSలో చేరారు. ఇక CM రేవంత్ సైతం అమీర్‌పేట్‌లో NTR విగ్రహం పెడతానని చెప్పడం, గ్రౌండ్ లెవెల్‌లో ఓ సామాజిక వర్గంతో సమావేశమై మద్దతు కూడగట్టారు. అటు BRS, BJP కూడా ఆశలు పెట్టుకున్నా ఆ పార్టీ ఓటర్లు INCకే జైకొట్టాయి.
News November 15, 2025
ECపై ఆరోపణలను కొట్టిపారేయలేం: స్టాలిన్

బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్ కుమార్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు RJD నేత తేజస్వీ యాదవ్ క్యాంపైన్ చేసిన తీరును మెచ్చుకున్నారు. ‘ఈ ఫలితాల నుంచి ఇండీ కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ఈ ఫలితాలతో ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. పౌరులు మరింత పారదర్శక ఎన్నికల సంఘానికి అర్హులు’ అని తెలిపారు.


