News September 21, 2024
కొత్తదారులు వెతకడమే ‘బైడెన్, మోదీ మీటింగ్’ ఎజెండా

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమే క్వాడ్ అని PM మోదీ అన్నారు. అమెరికాకు బయల్దేరే ముందు ఆయన మాట్లాడారు. ‘క్వాడ్ సమ్మిట్‌లో ప్రెసిడెంట్ బైడెన్, PM అల్బనీస్, PM కిషిదాను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం IND-US అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్‌తో సమావేశంలో అన్వేషిస్తాం’ అని అన్నారు.
Similar News
News November 17, 2025
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.
News November 17, 2025
అరకు, లంబసింగిలో కారవాన్ పార్కులు

ఏపీలో మొదటిసారిగా అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్‌లలో కారవాన్ పార్క్‌లు ఏర్పడనున్నాయి. పర్యాటకులకు చిన్న మొబైల్ హౌస్లా ఉండే కారవాన్‌ల్లో సురక్షితంగా ఉండే అవకాశం కలుతుందని అధికారులు తెలిపారు. లంబసింగిలో పైలట్‌గా 10-15 ఈ-కారవాన్ వాహనాలు అందించనున్నారు. మొత్తం మూడు పార్కులకు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టబడుతోంది. హోటల్ సౌకర్యాలు తక్కువైన ప్రాంతాల్లో ఇది కొత్త అనుభవం కానుంది.
News November 17, 2025
అజొల్లాను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?(2/2)

గోతిలో మట్టిని చల్లిన తర్వాత ఆవు పేడ 2kgలు, 30 గ్రాముల సూపర్ ఫాస్పేట్ను 10 లీటర్ల నీటిలో కలిపి గుజ్జుగా తయారు చేసి ఆ మట్టిపై పోయాలి. తొట్టెలో ఎప్పుడూ 10cm నీటిమట్టం ఉండాలి. ఆ నీటిలో 500 గ్రాముల నుంచి కిలో వరకూ తాజా అజొల్లా కల్చరును బెడ్ మీద సమానంగా చల్లాలి. దీని వల్ల అజొల్లా త్వరగా పెరిగి గొయ్యి మొత్తం ఆక్రమిస్తుంది. 10 నుంచి 15 రోజుల తర్వాత నుంచి రోజుకు 500 నుంచి 600 గ్రాముల అజొల్లా పొందవచ్చు.


