News April 5, 2024
లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన స్వతంత్రుల హవా!

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుల హవా క్రమంగా తగ్గిపోయింది. 1991 నుంచి పోటీ చేసిన వారిలో 99% మంది డిపాజిట్లు కోల్పోయారు. 1951-52లో 6.9% మంది స్వతంత్రులు ఎంపీలుగా గెలిచారు. 1957లో 8.7%, 1962లో 4.2%, 1984లో 0.30%, 2019లో 0.11% మంది మాత్రమే గెలుపొందారు. 1951-52లో 533 మంది పోటీ చేయగా 37 మంది గెలిచారు. 2019 ఎన్నికల్లో 8,000 మంది పోటీ చేయగా నలుగురే ఎన్నికయ్యారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News November 23, 2025
కమ్మగూడెం: 30ఏళ్లుగా మద్యం అమ్మకాలు నిషేదం

మర్రిగూడ మండలం కమ్మగూడెంలో 30ఏళ్లగా మద్యం అమ్మకాలు నిషేధించారు. ఇక్కడ నివసించే గ్రామస్థులు107 ఏళ్ల క్రితం గుంటూరు నుంచి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ గ్రామంలో గొలుసు దుకాణాలు లేవని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గొలుసు దుకాణాల నిర్మూలనకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని ఊర్లలో గొలుసు లేకుండా చేయాలని వారు సూచించారు.
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.


