News July 5, 2024
బ్రిటన్ ఎన్నికల్లో భారతీయుల హవా!

బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా కొనసాగించింది. ఏకంగా 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. తెలుగు సంతతికి చెందిన ఉదయ్ నాగరాజు, చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. గెలుపొందిన వారిలో రిషి సునాక్, బ్రేవర్మన్, ప్రీతి పటేల్, గగన్ మొహీంద్ర, శివాని రాజా, సీమా మల్హోత్రా, వాలెరీ వాజ్, కీత్ వాజ్, లీసా నాండీ, ప్రీత్ కౌర్ గిల్, తన్మంజిత్ సింగ్ ధేసి, నావెందు మిశ్రా తదితరులు ఉన్నారు.
Similar News
News November 23, 2025
NRPT: భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడి మశ్చీందర్ బాగ్లి మృతి

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడు మశ్చీందర్ బాగ్లి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణ మండలం హిందూపూర్కి చెందిన మశ్చీందర్ భూ నిర్వాసితుల పక్షాన నిలబడి అనతి కాలంలోనే ఓ నాయకుడి ఎదిగారు. 60 రోజుల పాటు భూ నిర్వాసితుల సమస్యలపై వివిధ పార్టీలతో కలిసి సమిష్టిగా పోరాటం చేశారు. ఆయన మరణం జిల్లాలో నిరాశను నింపింది. పలువురు నాయకులు, రైతులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


