News June 4, 2024
విజయవాడలో దుమ్మురేపిన కూటమి

AP: విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాలను భారీ మెజార్టీలతో కూటమి కైవసం చేసుకుంది. విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమకు మొత్తం 1,27,365 ఓట్లు పోలవగా 67,599 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్కి 1,18,841 ఓట్లు పడగా 49,640 ఓట్ల మెజార్టీ దక్కింది. బెజవాడ వెస్ట్‌లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి 46,729 ఓట్ల మెజార్టీ రాగా 104717 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News November 21, 2025
స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్పూర్లోనూ బైపోల్‌కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.
News November 21, 2025
పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. OCT 19 నుంచి NOV 19 మధ్య KG ధర సగటున ₹36 నుంచి ₹46కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.
News November 21, 2025
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.


