News November 27, 2024

మహారాష్ట్ర CM ఎవరనే ప్రశ్నకు త్వరలో సమాధానం: ఫడణవీస్

image

మహారాష్ట్ర CM ఎవరనేదానిపై త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఫడణవీస్ తెలిపారు. మహాయుతి కూటమి నేతలు దీనిపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తొలుత CMపై క్లారిటీ వచ్చాకే మిగతా నిర్ణయాలు ఉంటాయన్నారు. EVMలపై ప్రతిపక్షాలు తిరుగుబాటుకు సిద్ధమయ్యాయన్న మీడియా ప్రశ్నపై స్పందిస్తూ సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసిందని, EVMవిధానం కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు మానుకోవాలని ఢిల్లీలో చెప్పారు.

Similar News

News November 20, 2025

బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

image

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.

News November 20, 2025

ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

image

మన ఇమ్యూన్‌ సిస్టమ్‌ ఎప్పుడూ వైరస్‌లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.

News November 20, 2025

అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

image

ఆటోఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఇమ్యూన్‌ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్‌) అంతే బలంగా ఉంటాయి.