News July 31, 2024

ఉ.5.30కే మెట్రో ప్రారంభించాలని ప్రయాణికుల విజ్ఞప్తి

image

HYD మెట్రో ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఇవాళ్టి నుంచి ఉ.5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని అధికారులు చెప్పినా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఇవాళ ఉ.6 గంటల తర్వాతే నాగోల్‌లో తొలి రైలు బయల్దేరింది. ఉ.5.40 తర్వాతే మెట్రో సిబ్బంది విధులకు హాజరయ్యారు. టైమింగ్స్ మార్పుపై తమకు అధికారిక ఆదేశాలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. అటు ఉ.5.30కే రైళ్లు స్టార్ట్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News January 5, 2026

RARE PHOTO: ఆ రోజుల్లో ఆర్భాటాలే లేవు!

image

ప్రస్తుతం షూటింగ్ అనగానే నటీనటులు క్యారవాన్లకే పరిమితమవుతున్నారు. కానీ ఒకప్పుడు ఆ ఆర్భాటాలు ఉండేవి కావు. షూటింగ్ విరామంలో నటీనటులందరూ కలిసి ఒకే చోట భోజనాలు చేసేవారు. ఆనాటి రోజులను గుర్తుచేసే పాత ఫొటో ఒకటి తాజాగా వైరలవుతోంది. సీనియర్ నటులు కోట, తనికెళ్ల, AVS, గుండు హన్మంతరావు భోజనం చేస్తుంటే అలీ వడ్డించడం అందులో చూడొచ్చు. ఈ అరుదైన ఫొటో ‘శుభలగ్నం’ సినిమా షూటింగ్‌కు సంబంధించినది.

News January 5, 2026

యాషెస్ 5వ టెస్ట్.. 2వ రోజు పోరాడుతున్న ఆస్ట్రేలియా

image

యాషెస్ సిరీసులో సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో 2వ రోజు ఆట ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో AUS 166/2 రన్స్ చేసి మరో 218 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (91 నాటౌట్), జేక్ వెదరాల్డ్ (21) 74 బాల్స్‌లో 57 రన్స్ చేసి తొలి వికెట్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. మైఖెల్ నెసర్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 211/3 ఓవర్‌నైట్ స్కోరుతో 2వ రోజు ఆట మొదలుపెట్టిన ENG 384 రన్స్‌కు ఆలౌటైంది.

News January 5, 2026

చైనాను గట్టి దెబ్బ కొట్టిన అమెరికా!

image

సోషలిస్ట్ దేశమైన వెనిజులాలో చైనా రూ.లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టింది. ఎనర్జీ నుంచి స్పేస్ వరకు కీలక భాగస్వామిగా ఉంటూ రూ.వేల కోట్లు అప్పుగా ఇచ్చింది. ద్రవ్యోల్బణంతో వెనిజులా వాటిని తీర్చలేని దుస్థితిలో ఉంటే తక్కువ ధరకే ఆయిల్ దిగుమతి చేసుకుంటూ లబ్ధి పొందుతోంది. తాజాగా యూఎస్ జోక్యంతో అక్కడ మదురో పాలన అంతమైంది. దీంతో వెనిజులాలో చైనా పెట్టుబడులు, ఆయిల్ దిగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.