News October 11, 2024
రాత్రి 7గంటలకు ముగియనున్న లిక్కర్ షాపుల దరఖాస్తు గడువు

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఈరోజు రాత్రితో ముగియనుంది. రాత్రి 7గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు, 12 గంటల్లోపు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశముంది. బ్యాంకు DDలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అప్లై చేసుకోవచ్చు. కాగా నిన్న రాత్రి 8గంటల వరకు 65,629 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో 20 దరఖాస్తులు అమెరికా నుంచి రావడం గమనార్హం. నాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో రూ.1312.58 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
Similar News
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు: CM

TG: భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సని సమీక్షలో CM రేవంత్ పేర్కొన్నారు. ఏర్పాట్లు, ప్రోగ్రాం షెడ్యూల్‌ను అధికారులు వివరించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనను CM వివరించారు. భవిష్యత్ వృద్ధి ప్రణాళికలను ప్రధానంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్‌గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
News December 6, 2025
భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్ VVERలను భారత్ నిర్వహిస్తోంది.
News December 6, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.


