News September 22, 2024
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 202 రన్స్‌కే ఆలౌటైంది. ఆ జట్టులో స్మిత్ (49) టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, హేజిల్‌వుడ్, హార్డీ, మ్యాక్స్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఐదు వన్డేల సిరిస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంతో నిలిచింది. తొలి వన్డేలోనూ ఆ జట్టు గెలిచింది.
Similar News
News January 15, 2026
ఎయిర్‌ఫోర్స్ స్కూల్ హిండెన్‌లో ఉద్యోగాలు

ఘజియాబాద్‌లోని <
News January 15, 2026
మనోళ్లదే డామినేషన్.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు!

అండర్-19 WCలో INDతో ఆడుతున్న అమెరికా జట్టులోని ప్లేయర్లందరూ భారత మూలాలు ఉన్నవారే కావడం విశేషం. ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్ పూర్వీకులు ఇండియా నుంచి వెళ్లారు. దీంతో మనోళ్ల డామినేషన్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది IND vs USA కాదని.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు అని జోకులు పేలుస్తున్నారు.
News January 15, 2026
ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.


