News December 1, 2024
దేశంలో సగటు పెళ్లి ఖర్చు రూ.36.50 లక్షలు!

దేశంలో పెళ్లి ఆర్భాటాలకు చేస్తున్న ఖర్చు ఏటా పెరుగుతున్నట్లు వెడ్డింగ్ ప్లానర్ సంస్థ వెడ్మీగుడ్ సర్వే వెల్లడించింది. 2022లో ఓ పెళ్లి ఖర్చు సగటున ₹25L ఉండగా 2024లో ఆ మొత్తం ₹36.50Lకు చేరినట్లు తెలిపింది. ప్రతి ఐదింటిలో ఓ వివాహ ఖర్చు ₹50L ఉంటోందని చెప్పింది. ₹కోటిపైన 9%, ₹50L-₹1Cr మధ్య 9%, ₹25L-50 మధ్య 23%, ₹15L-25L మధ్య 19%, ₹15L లోపు 40% మంది వెచ్చిస్తున్నారంది.
Similar News
News January 29, 2026
మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

TG: మేడారం మహాజాతరలో ఇవాళ ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. నిన్న 40 లక్షల మంది గద్దెలను దర్శించుకున్నారు.
News January 29, 2026
CLRIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News January 29, 2026
మొక్కజొన్న కంకిలో గింజలు చివరి వరకూ రావాలంటే?

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.


