News June 7, 2024
సౌరభ్ నేత్రావల్కర్ నేపథ్యమిదే!

USA జట్టులో ఉన్న <<13394153>>సౌరభ్ నేత్రావల్కర్<<>> మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఈయన ICC U-19 WC 2010లో భారత్ తరఫున ఆడారు. 2013లో కర్ణాటకతో జరిగిన రంజీ గేమ్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. 2018లో USA జట్టుకి ఎంపికై 2019లో కెప్టెన్ అయ్యారు. 2022 జింబాబ్వేలో జరిగిన ICC మెన్స్ T20 WC గ్లోబల్ క్వాలిఫయర్ B టోర్నమెంట్లో మ్యాచ్‌లో USA తరఫున 5 వికెట్లు తీసి సత్తా చాటారు.
Similar News
News September 9, 2025
డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

యూఎస్ ఓపెన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు ట్రంప్‌తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్‌తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్‌సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.
News September 8, 2025
ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ రైలు

AP: సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 07637/07638 నంబర్ రైలు రేణిగుంట, కడప, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మోత్సవాలు, పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును రెగ్యులర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ రైలు టెంపరరీ సర్వీస్‌గా కొనసాగింది.