News July 19, 2024
ఇంటికి తాళం వేసిన బ్యాంకు అధికారులు.. వ్యక్తి సూసైడ్

లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు బెంగళూరుకు చెందిన ఇద్దరు పిల్లల తండ్రి గౌరీ శంకర్ శర్మ బలయ్యారు. దీనిపై శర్మ బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన శర్మ గత 18 నెలలుగా హౌస్ లోన్ EMI చెల్లించలేదు. EMI చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అపార్ట్మెంట్లోకి చొరబడి ఇంటికి తాళం వేసి అవమానించారు. అందుకే శర్మ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<
News November 12, 2025
వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.


