News October 8, 2024
తాజ్‌మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.
Similar News
News April 1, 2026
7.30 గంటల నిడివితో ధురంధర్!

కంటెంట్, అధిక రన్ టైమ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.

‘అతిరథ మహారథులు’ అంటే ఎవరు?

ఏదైనా రంగంలో సమర్థులు, శక్తిమంతుల గురించి చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఇది పురాణాల నుంచి వచ్చింది. యుద్ధ నైపుణ్యాలను బట్టి వీరులకు 5 స్థాయులుంటాయి. రథి అంటే ఒకేసారి 5వేల మందితో యుద్ధం చేసేవాడు. అతిరథి అంటే రథికి 12 రెట్లు, మహారథి అంటే 12 అతిరథులతో సమానం. అతి మహారథి అంటే 12 మహారథుల శక్తి గలవాడు. మహామహారథి అంటే మహారథికి 24 రెట్లు. వీరందరినీ కలిపి అతిరథ మహారథులుగా పిలిచేవారు.
<<-se>>#EPICSAYINGS<<>>