News March 21, 2025
తులసి మెుక్క ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..!

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.
Similar News
News October 14, 2025
ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్: లోకేశ్

విశాఖలో గూగుల్ <<18002028>>పెట్టుబడుల ఒప్పందం<<>> తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ అని పేర్కొన్నారు. కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
News October 14, 2025
ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్షిప్ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్షిప్ అందిస్తోంది. ఇంటర్లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్సైట్: <
News October 14, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <