News October 29, 2024

నేను ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ ఇతనే: మ్యాక్సీ

image

భారత స్టార్ బౌలర్ బుమ్రాపై ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ప్రశంసల వర్షం కురిపించారు. తాను ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ బుమ్రా అని అన్నారు. స్లో బాల్, యార్కర్లతో నమ్మశక్యం కాని విధంగా బౌలింగ్ చేస్తారని చెప్పారు. మ్యాక్సీ, బుమ్రా 15 ఇన్నింగ్సుల్లో తలపడగా ఏడు సార్లు వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. కాగా త్వరలో జరగనున్న BGTకి మ్యాక్స్‌వెల్ ఎంపిక కాలేదు.

Similar News

News January 5, 2026

వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.

News January 5, 2026

ఇతిహాసాలు క్విజ్ – 118

image

ఈరోజు ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గ ద్వారం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

News January 5, 2026

భారీ జీతంతో RBIలో ఉద్యోగాలు

image

<>RBI <<>> లో 93 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc, BSc, BE, BTech, MTech, MCA, PhD, CA, CMA, MBA, LLB, LLM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం గ్రేడ్ C పోస్టులకు రూ.3,10,000, గ్రేడ్ D పోస్టులకు రూ.4,30,000, గ్రేడ్ E పోస్టులకు రూ.4,80,000 చెల్లిస్తారు. ఇంకా జీతం పెంపుకు డిమాండ్ చేయవచ్చు. వెబ్‌సైట్: rbi.org.in/