News October 15, 2025
రబీలో మేలైన ‘కంది’ రకాలివే..

తెలుగు రాష్ట్రాల్లో వర్షం, నీటి సదుపాయాన్ని బట్టి రబీలో కందిని ఈ నెలాఖరు వరకు సాగుచేసుకోవచ్చు. TGలో WRG-65, WRG-53, WRG-255, TDRG-59, LRG-41, ICPL-87119, ICPH-2740, TDRG-4 రకాలు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి 5-6KGలు విత్తుకోవచ్చని తెలిపారు. ఆఖరి దుక్కిలో 20KGల నత్రజని, 50KGల భాస్వరంను వేయాలి, పైరు 30-40 రోజుల మధ్యలో మరో 20KGలను పైపాటుగా వేయాలని సూచిస్తున్నారు.
#ShareIt
Similar News
News February 21, 2026
వికసిత్ భారత్‌కు ‘మేడ్ ఇన్ ఇండియా చిప్స్’ కీలకం: మోదీ

IND అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి స్వయంసమృద్ధి సాధించడం కీలకమని PM మోదీ తెలిపారు. ఫాక్స్‌కాన్, HCL యూపీలో ఏర్పాటుచేయనున్న సెమీకండక్టర్ పరిశ్రమకు వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేశారు. ‘కరోనా టైమ్‌లో చిప్‌ల సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. వికసిత్ భారత్‌కు మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ముఖ్యం. ఈ దశాబ్దంలో నిర్ణయాలు 21వ సెంచరీలో సామర్థ్యాలకు పునాదులవుతాయి’ అని పేర్కొన్నారు.
News February 21, 2026
మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ టారిఫ్స్‌ను 10 నుంచి 15 శాతానికి పెంచారు. దశాబ్దాలుగా USను పలు దేశాలు దోచుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన సుంకాలను నిర్ణయించి అమలు చేస్తామన్నారు. కాగా ప్రపంచ దేశాలపై టారిఫ్స్ వేసే హక్కు అధ్యక్షుడికి లేదని US సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై మండిపడిన ట్రంప్ కొద్ది గంటల కిందటే 10% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.
News February 21, 2026
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సీనియర్ ఫీల్డ్ కమాండర్ సహా 10 మంది మరణించగా 50 మందికి గాయాలయ్యాయి. ఇరు దేశాల మధ్య 2024 నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించాయి. తమ దేశంపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారనే పక్కా సమాచారంతోనే రివర్స్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.


