News May 19, 2024
రాష్ట్రంలోనే అతి పెద్ద మెగా ఫుడ్ పార్క్.. జూన్‌లో ప్రారంభం

TG: రాష్ట్రంలోనే అతి పెద్దదైన, ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ ఖమ్మంలోని బుగ్గపాడులో ఏర్పాటైంది. దాదాపు 200ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. రైతులు, వ్యాపారులు, ఎగుమతి దారులు, పారిశ్రామిక వేత్తల కార్యకలాపాలకు ఇది వేదిక కానుంది. ఇందులో వివిధ కంపెనీలతో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా 25వేల మందికి ఉపాధి లభించనుంది.
Similar News
News November 25, 2025
CSIR-NEERIలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) 14 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 23వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.Tech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://neeri.res.in
News November 25, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.
News November 25, 2025
దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.


