News March 26, 2025

బీఆర్ఎస్ చేసిన అతి పెద్ద స్కామ్ ‘మన ఊరు-మన బడి’: అక్బరుద్దీన్

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ‘బీఆర్ఎస్ చేసిన మిగతా స్కామ్స్ అన్నీ చాలా చిన్నవి. మన ఊరు-మన బడి కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలి. 4823 ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు. బాలికలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News January 31, 2026

జనసేన MLA శ్రీధర్‌పై NHRCకి వీణ ఫిర్యాదు

image

AP: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపిన జనసేనకు చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణల వ్యవహారం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు వీణ ఫిర్యాదు చేశారు. వీణ తరఫున న్యాయవాది అజాద్ NHRCలో ఈ కేసు పెట్టారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని విచారణకు స్వీకరించింది.

News January 31, 2026

పోస్టాఫీసుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

పోస్టాఫీసుల్లో GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 14వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తులను ఫిబ్రవరి 2 – ఫిబ్రవరి 16 వరకు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో BPM, ABPM పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://indiapost.gov.in/

News January 31, 2026

‘దశరథ గడ్డి’ని ఎలా సాగు చేయాలి?

image

దశరథ గడ్డి(హెడ్జ్ లూసర్న్) పాడి పశువులకు, జీవాలకు మేలు చేసే బహువార్షిక పప్పుధాన్యపు గడ్డి. ఇందులో మాంసకృత్తులు, ప్రొటీన్లు, ఫైబర్, లిగ్నిన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. ఎకరాలో సాగుకు 10kgల విత్తనాలు సరిపోతాయి. కేజీ విత్తనానికి కేజీ ఇసుకను కలిపి వేయాలి. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు దశరథ గడ్డి సాగుకు పనికిరావు. ఒక హెక్టారుకు 90-100 టన్నుల పశుగ్రాసం వస్తుంది.