News November 2, 2024
చరిత్ర సృష్టించిన బైకర్ గర్ల్
ఝార్ఖండ్‌కు చెందిన ‘బైకర్ గర్ల్’ కంచన్ ఉగుర్సాండి ఇండియా-చైనా సరిహద్దుకు చేరుకొని చరిత్ర సృష్టించారు. 17,500 అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్‌ను చేరుకున్న మొదటి మోటార్‌సైకిలిస్ట్‌గా ఆమె నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కైలాస మానసరోవర్ రహదారిలో డ్రైవ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. 32 ఏళ్ల ఈ గిరిజనురాలు ఢిల్లీ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ గుండా ప్రయాణించారు.
Similar News
News December 27, 2024
తినడానికి తిండిలేక మన్మోహన్ పస్తులు
ఎన్నో హోదాల్లో పనిచేసిన మన్మోహన్ ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారని ఆయన కూతురు దమన్ సింగ్ ఓ పుస్తకంలో ప్రస్తావించారు. ‘కేంబ్రిడ్జ్ వర్సిటీలో ట్యూషన్ ఫీజు, ఖర్చులు కలిపి ఏడాదికి 600పౌండ్లు అయ్యేది. పంజాబ్ వర్సిటీ 160పౌండ్లు ఇస్తుండేది. తాత డబ్బు సర్దుబాటు కాక పంపడం ఆలస్యమయ్యేది. దీంతో నాన్న కొన్నిసార్లు పస్తులు ఉండేవారు. డబ్బును పొదుపుగా వాడుతూ చాక్లెట్‌తో కడుపు నింపుకునేవారు’ అని తెలిపారు.
News December 27, 2024
భారత్‌పై స్మిత్ రికార్డు
టీమ్ ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశారు. 167 బంతుల్లో శతకం చేశారు. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో సెంచరీ. మొత్తంగా భారత్‌పై 11వది. దీంతో టీమ్ ఇండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కారు. టెస్టుల్లో 34 సెంచరీల మార్కును అందుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 394/6గా ఉంది.
News December 27, 2024
మన్మోహన్ అరుదైన ఫొటోలు.. గ్యాలరీ
మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.