News November 16, 2024
చిన్నాన్నతో అనుబంధం మరువలేనిది: లోకేశ్

AP: తన చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడి మృతితో మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. చిన్నాన్నతో చిన్నప్పటి అనుబంధం కళ్ల ముందే మెదలాడుతోందన్నారు. ‘ఇన్నాళ్లు ఆయన కంటికి కనిపించే ధైర్యం. కానీ ఇకపై చిరకాల జ్ఞాపకం. అంతులేని దుఖంలో ఉన్న పిన్ని, తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలి. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News February 18, 2026
అజిత్ పవార్ దుర్మరణం రోజే 75 ఫైళ్లు క్లియర్.. ఎలా సాధ్యం?

జనవరి 28న అజిత్ పవార్ విమాన ప్రమాద వార్తతో మహారాష్ట్ర మొత్తం షాక్‌లో ఉంటే ఆ రాష్ట్ర మైనారిటీ శాఖ మాత్రం అదే రోజు ఏకంగా 75 స్కూల్ ఫైళ్లను క్లియర్ చేసేసింది. ఒక్క రోజులోనే ఇన్ని ఫైళ్లపై సంతకాలు ఎలా చేశారంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రచ్చ ముదరడంతో డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌పై బదిలీ వేటు పడింది. దీని వెనక ఏదో మతలబు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
News February 18, 2026
ఆపరేషన్ సిందూర్‌పై సినిమా!

కశ్మీర్ ఫైల్స్, వ్యాక్సిన్ వార్, బెంగాల్ ఫైల్స్ వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆపరేషన్ సిందూర్‌పై సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం నిర్మాత భూషణ్ కుమార్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తోంది. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత మిలిటరీ స్ట్రైక్స్‌ను ఇందులో చూపించనున్నట్లు సమాచారం. నటీనటులు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
News February 18, 2026
బొప్పాయి రోజూ తింటే..

బొప్పాయి అన్ని సీజన్లలో లభించే పండ్లలో ఒకటి. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. జీర్ణ సమస్యలు, దృష్టిలోపాలతో పాటు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. వీటితో పాటు అల్జీమర్స్, ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండెజబ్బులను దూరం చేయడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.


