News August 29, 2024
3500 ఏళ్లనాటి కూజాను పగులగొట్టిన బాలుడు.. మ్యూజియం ఏం చేసిందంటే?

ఇజ్రాయెల్లోని హెచ్ట్ మ్యూజియంలోని పురాతన వస్తువులను చూసేందుకు వచ్చిన నాలుగేళ్ల బాలుడు 3500 ఏళ్ల నాటి కూజాను పగులగొట్టాడు. వస్తువులను చూసే బిజీలో తండ్రి ఉండగా ఆ బాలుడు కూజా వద్దకు వెళ్లి లాగడంతో పడి ముక్కలైంది. ఇది 2200-1500BC మధ్య కాంస్య యుగం నాటిదని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. పిల్లాడు కావాలని చేయకపోవడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, విరిగిన వస్తువులను పునరుద్ధరిస్తామన్నారు.
Similar News
News January 22, 2026
CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<
News January 22, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,100 పతనమై రూ.1,41,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 22, 2026
ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో మార్కెట్లు

యూరప్ దేశాలపై టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 649 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు పెరిగి 25,372 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, SBI, అదానీ పోర్ట్స్, BEL షేర్లు లాభాల్లో ఉన్నాయి.


