News April 10, 2024

కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు.. చివరికి..

image

AP: నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. కరీముల్లా, అమ్ములు దంపతులకు రెండేళ్ల కుమారుడు కాలేషా ఉన్నాడు. అమ్ములు స్థానికంగా ఉండే చేపల దుకాణంలో పనిచేస్తోంది. కుమారుడిని కూడా వెంట తీసుకెళ్తూ ఉండేది. ఈనెల 7న తల్లితో పాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. పెట్రోల్ బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్ అనుకొని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కాలేషా చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News November 15, 2024

డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC ఛైర్మన్

image

విద్యార్థులు 3ఏళ్ల డిగ్రీ కోర్సును రెండున్నరేళ్లలో, 4ఏళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తిచేసే అవకాశాన్ని UGC కల్పించనుంది. 2025-26 నుంచి దీన్ని అమలు చేస్తామని UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. స్లోగా చదివే విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో పూర్తిచేసే ఛాన్స్ ఇస్తామని, అలాగే మధ్యలో విరామం తీసుకుని మళ్లీ చేరే అవకాశాన్నీ కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.

News November 15, 2024

‘లాంగెస్ట్ సర్‌నేమ్’ క్రికెటర్‌కు 103 ఏళ్లు

image

క్రికెట్‌లో పలు రికార్డులతో చరిత్రలో నిలిచిపోవడం సహజం. కానీ ఫిజీకి చెందిన ఓ క్రికెటర్ లాంగెస్ట్ సర్‌నేమ్‌తో వరల్డ్ ఫేమస్. అతని పేరు Ilikena Lasarusa Talebulamainavaleniveivakabulaimainakulalakebalau. IL బులా అని పిలుస్తారు. ఆ పేరుకు ‘లావ్ గ్రూప్‌ లకెంబా ద్వీపంలోని నంకుల ఆస్పత్రి నుంచి సజీవంగా తిరిగి వచ్చాడు’ అని అర్థం. 1921 NOV 15న పుట్టిన ఇతనికి నేటితో 103 ఏళ్లు. 1947-54 మధ్య 9 మ్యాచ్‌లు ఆడారు.

News November 15, 2024

లిక్కర్ బ్యాన్ కొత్త తరహా నేరాలకు కారణమైంది: పట్నా హైకోర్ట్

image

బిహార్‌లో అమలవుతున్న మద్యపాన నిషేధంపై పట్నా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కొత్త తరహా నేరానికి కారణమవుతోందని, కొందరికి వరంలా మారిందని వ్యాఖ్యానించింది. మంచి ఉద్దేశంలో అమలు చేస్తున్న లిక్కర్ బ్యాన్‌ కొందరు తాము లాభపడేందుకు మద్దతిచ్చారని పేర్కొంది. ముకేశ్ కుమార్ పాశ్వన్ అనే పోలీసును లిక్కర్ వ్యవహారంలో డిమోట్ చేయగా, అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు పైవిధంగా స్పందించింది.