News September 16, 2024

బాణసంచా పేలి భవనం ధ్వంసం.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణసంచా పేలి ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 15, 2025

ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

image

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్‌ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.

News November 15, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు

image

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(<>TSLPRB<<>>) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్(MPC,Bi.PC), MSc(ఫిజిక్స్, ఫోరెన్సిక్ సైన్స్,కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, జెనిటిక్స్, బయో కెమిస్ట్రీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్), M.Tech, MCA, BSc, BCAఉత్తీర్ణులై ఉండాలి. ఈనెల 27 నుంచి DEC 15వరకు అప్లై చేసుకోవచ్చు.

News November 15, 2025

బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

image

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.