News September 20, 2025

గ్రామాల్లో వృద్ధులపైనే వ్యవసాయ భారం

image

వ్యవసాయానికి గ్రామాలే వెన్నెముక. ఇక్కడ పండే పంటలే మిగిలిన ప్రాంతాలకు ఆధారం. నేటి యువత వ్యవసాయాన్ని విస్మరించి, జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో నేడు వ్యవసాయం, పశుపోషణాభారం వృద్ధులపైనే పడుతోంది. ప్రస్తుతం గ్రామాల్లోని వృద్ధులు.. రైతులుగా, పశుపోషకులుగా, వ్యవసాయ కూలీలుగా, కుటుంబ సంరక్షులుగా, అనేక ఉత్పాదక పనులు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

Similar News

News January 27, 2026

అసెంబ్లీ ఎన్నికల ముంగిట INCకి షాక్

image

ఇటీవల INCకి షకీల్ అహ్మద్, నసీముద్దీన్ సిద్దిఖీ వంటి ముస్లిం నేతలు రాజీనామా చేశారు. కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇది ఆ పార్టీకి షాక్‌గా మారింది. కేరళలో 27%, అస్సాంలో 34% ముస్లింలు ఉన్నారు. వీరి ఓట్లపై INC ఆశలు పెట్టుకుంది. కాగా ముస్లింలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలను ఎంచుకుంటున్నారు. బిహార్(RJD), WB(TMC)లే ఇందుకు ఉదాహరణ. MIMకీ మద్దతిస్తున్నారు.

News January 27, 2026

ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే..

image

పంట కోత తర్వాత నిల్వ చేసే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది వేడెక్కి రంగు మారుతుంది. అలాగే పురుగులు, శిలీంధ్రాలు ధాన్యాన్ని ఆశిస్తాయి. బూజు ఏర్పడి, ధాన్యం రంగు మారి వాసన వచ్చి నాణ్యత లోపిస్తుంది. సాధారణంగా వరి ధాన్యంలో తేమ శాతం 22-24% ఉన్నప్పుడు కోస్తారు. ఈ ధాన్యంలో తేమ 12 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టి నిల్వ ఉంచితే పురుగు పట్టకుండా 6 నుంచి 12 నెలల వరకు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News January 27, 2026

దేశ చరిత్రలోనే అతిపెద్ద డీల్: మోదీ

image

EUతో కుదిరిన FTAని PM మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. సంతకాలు పూర్తయిన అనంతరం మాట్లాడారు. భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందమని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందన్నారు. 5 ఏళ్లలో ఇన్నోవేషన్, డిఫెన్స్ రంగాల్లో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందన్నారు. గ్లోబల్ ట్రేడ్ కోసం IMEC కారిడార్‌ను డెవలప్ చేస్తూ అంతర్జాతీయ వ్యవస్థలో స్థిరత్వం కోసం భారత్-EU పనిచేస్తాయన్నారు.