News March 29, 2024
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలో పండింది. ఈ ఘటనలో 45 మంది మరణించారు. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడగా.. ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 23, 2026
టుడే టాప్ స్టోరీస్

* ముగిసిన AP, TG సీఎంలు చంద్రబాబు, రేవంత్ దావోస్ పర్యటన
* ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRకు నోటీసులు.. రేపు విచారణ
* రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: YS జగన్
* తిరిగి రాజకీయాల్లోకి వస్తా: విజయసాయి రెడ్డి
* బ్యాడ్మింటన్‌లో 500 విజయాలు సాధించిన భారత ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డ్
* భారత్‌లో T20WC ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్
* లాభాల్లో మార్కెట్లు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
News January 23, 2026
టెక్ మహీంద్రా విస్తరణను వేగవంతం చేయండి: లోకేశ్

AP: టెక్ మహీంద్రా CEO&MD మోహిత్ జోషీతో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. VJAలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. AI & ML, క్లౌడ్ IOT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ&సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతోనూ లోకేశ్ చర్చించారు.
News January 23, 2026
WPL: యూపీపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.


