News April 11, 2025

మార్కెట్లో కనిపించని మామిడి సందడి

image

TG: ఏప్రిల్ రెండో వారం పూర్తవుతున్నా మర్కెట్‌లో అంతగా మామిడి పండ్లు కనిపించడం లేదు. సహజంగా మార్చి నుంచే మామిడిపండ్లతో నిండే మార్కెట్లలో ఇప్పుడు అంతగా సరఫరా లేదు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు పూత అంతగా రాలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరిలో పూత రాగా, ఆ ప్రభావం సరఫరాపై పడింది. మార్కెట్లో అక్కడక్కడా మామిడి కనిపిస్తున్నా ధరలు మాత్రం మండిపోతున్నాయి. కిలో రూ.150-250 మధ్య పలుకుతున్నాయి.

Similar News

News April 18, 2025

రేపు దేశవ్యాప్త నిరసనలకు VHP పిలుపు

image

హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్(VHP) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు VHP ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో సంస్థ సభ్యులు, మద్దతుదారులు ధర్నాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల మెజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.

News April 18, 2025

అందుకే వైసీపీ నుంచి బయటికి వచ్చాను: విజయసాయి రెడ్డి

image

AP: వైసీపీలో తాను నంబర్ 2గా ఉన్నానని, జగన్‌కు వెన్నుపోటు పొడిచానని మీడియాలో రాస్తున్నారని ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 స్థానమనేది ఓ మిథ్య. నాయకుడికి నాపై ఓ కోటరీ చాలా అపోహలు కల్పించింది. ఆయన మనసులో నాకు స్థానం లేదని గ్రహించి అవమాన భారం తాళలేక పార్టీని వీడాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే నా స్థానం 2వేలకు పడిపోయింది’ అని పేర్కొన్నారు.

News April 18, 2025

ఆ నటుడు డ్రగ్స్ డిమాండ్ చేసేవాడు.. నిర్మాత ఆరోపణ

image

‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు శ్రీనాథ్ భాసీ ప్రస్తుతం ‘నముక్కు కొడత్తియిల్ కాణం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా నిర్మాత హజీబ్ మలబార్ శ్రీనాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలో తనకు ఫోన్ చేసి డ్రగ్స్ తీసుకురావాలని వేధించేవాడని, షూట్ సమయంలో కారవాన్‌లో డ్రగ్స్‌ను దాచి వాడేవాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అతడి కారణంగా తమ సినిమా షూటింగ్, డబ్బింగ్ ఆలస్యమయ్యాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

error: Content is protected !!