News October 7, 2024
మంత్రి సురేఖను తప్పిస్తారంటూ ప్రచారం.. పీసీసీ చీఫ్ ఏమన్నారంటే?

TG: సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని PCC చీఫ్ మహేశ్ కుమార్ ఖండించారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసిందని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News March 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 11, 2026
శుభ సమయం (11-3-2026) బుధవారం

➤ తిథి: బహుళ అష్టమి రా.2.17 వరకు
➤ నక్షత్రం: జ్యేష్ఠ రా.8.24 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.12-8.10, ఉ.9.10-10.09, మ.12.32-మ.3.05, సా.4.04-సా.5.03
➤ రాహుకాలం: మ.12.00-మ.1.30
➤ యమగండం: ఉ.7.30-ఉ.9.00
➤ దుర్ముహూర్తం: ఉ.11.44-మ.12.31
➤ వర్జ్యం: తె.5.13 నుంచి
➤ అమృత ఘడియలు: ఉ.10.38-మ.12.25
News March 11, 2026
LPG ఉత్పత్తిని పెంచుతున్నాం: రిలయన్స్ ఇండస్ట్రీస్

గ్లోబల్ ఇంధన మార్కెట్లలో అస్థిరత నేపథ్యంలో LPG ఉత్పత్తిని పెంచుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దేశ ప్రజలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ జామ్ నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ హబ్‌లో LPG ఉత్పత్తిని మాక్సిమైజ్ చేసినట్లు పేర్కొంది. భారతీయ కుటుంబాల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని తెలిపింది.


