News October 9, 2024
రాష్ట్రంలో 30 జిల్లాలు అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన CM

AP: రాష్ట్రంలో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం, మదనపల్లె, ఇతర కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనే హామీలున్నాయని, కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో ఉండదని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉండగా వాటిని 30కి పెంచినట్లు ఓ ఫేక్ జీవో వైరల్ అవుతోంది.
Similar News
News January 25, 2026
అసెంబ్లీ గందరగోళంపై రాష్ట్రపతికి నివేదిక

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన <<18923034>>గందరగోళం<<>>పై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాష్ట్రపతి ముర్ముకు నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉన్న కారణంగా ప్రసంగ ముసాయిదాలోని 2 నుంచి 11 పేరాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించానని తెలిపారు. అదే విధంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు.
News January 25, 2026
ముద్దు సీన్లకు భయపడే ఛాన్స్‌లు వదులుకున్నా: సోనమ్ బజ్వా

ముద్దు సన్నివేశాల్లో నటించాలనే భయంతోనే బాలీవుడ్ అవకాశాలు వదులుకున్నానని నటి సోనమ్ బజ్వా అన్నారు. ‘‘ముద్దు సీన్లలో నటిస్తే పంజాబ్‌లో ఇమేజ్ ఏమవుతుందోనని భయపడ్డాను. నా ఫ్యామిలీ ఎలా అర్థం చేసుకుంటుందో, అభిమానులు ఏమనుకుంటారో అనుకున్నాను. పేరెంట్స్‌తో డిస్కస్ చేయడానికి సిగ్గుపడ్డాను. చివరికి అడిగితే ‘సినిమా కోసమేగా. తప్పేముంది’ అనడంతో షాకయ్యాను’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
News January 25, 2026
టాస్ గెలిచిన టీమ్ ఇండియా.. టీమ్స్ ఇవే

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్‌కు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో బుమ్రా, బిష్ణోయ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, బుమ్రా, కుల్దీప్, బిష్ణోయ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, సాంట్నర్, జెమీసన్, హెన్రీ, సోథీ, జాకబ్.


