News June 28, 2024
కెప్టెన్, వైస్ కెప్టెన్ అంతా తామై..!

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా చేరుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం ఇద్దరూ జట్టును ముందుండి నడిపించారు. రోహిత్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 248 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు. అలాగే పాండ్య అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించారు. 139 రన్స్‌తో పాటు 8 వికెట్లు తీసి జట్టు విజయాలకు కృషి చేశారు.
Similar News
News November 2, 2025
తొలి ‘గే’ ప్రధానిగా రాబ్ జెట్టెన్!

నెదర్లాండ్స్ ఎన్నికల్లో D66 సెంట్రిస్ట్ పార్టీ ఇటీవల ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్, 38ఏళ్ల రాబ్ జెట్టెన్ ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఆ దేశ పిన్న వయస్కుడు, తాను ‘గే’ అని బహిరంగంగా చెప్పుకున్న రాబ్ PMగా నిలిచి రికార్డులకెక్కనున్నారు. ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని, గొప్ప బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు. కాగా అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్‌తో జెట్టెన్ ఎంగేజ్మెంట్ 3ఏళ్ల కిందటే జరిగింది.
News November 2, 2025
ఏఐ ప్రభావాన్ని పెంచేలా నియామకాలు: సత్య నాదెళ్ల

భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విస్తరణ స్మార్ట్‌గా ఉంటుందని సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని, ఈ నియామకాలు AI ప్రభావాన్ని పెంచేలా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా యాంత్రికంగా ఏదీ ఉండదన్నారు. AI సాయంతో వేగంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీలో 2.28L మంది ఉద్యోగులున్నారు. పలు దశల్లో 15K మందికి లేఆఫ్స్ ఇచ్చింది.
News November 2, 2025
FINAL: టాస్ ఓడిన భారత్

WWCలో నేడు భారత్‌తో జరగాల్సిన ఫైనల్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీమ్ ఇండియా: షెఫాలీ వర్మ, స్మృతి మందాన, రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్(C), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్ జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
సౌతాఫ్రికా: లారా (C), బ్రిట్స్, బాష్, సునే లుస్, కాప్, జఫ్టా, డ్రెక్సెన్, ట్రైయాన్, డి క్లెర్క్, ఖాక, మ్లాబా.


