News March 27, 2025

కొన్న 4 రోజుల్లోనే కారు బ్రేక్ డౌన్.. కస్టమర్ ఏం చేశాడంటే?

image

రూ.లక్షలు పెట్టి కొన్న కారు కొద్ది రోజులకే బ్రేక్ డౌన్ అయితే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ‘టాటా’ షోరూమ్‌లో కారు కొన్న ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతను కొన్న కారు 4 రోజుల్లోనే ఆగిపోతుండటంతో షోరూమ్‌కు వచ్చి సిబ్బందిని నిలదీశాడు. అడిగినందుకు తనపై దాడి చేశారంటూ వినూత్నంగా నిరసన తెలిపాడు. తన సమస్యను అందరికీ తెలియజేసేలా ఫ్లెక్సీని కారు వెనకాల ఏర్పాటు చేసి షోరూమ్ వద్ద బైఠాయించాడు.

Similar News

News October 31, 2025

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదనే నమ్ముతా: ఉప రాష్ట్రపతి

image

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని దేవర్ చెప్పినట్లు ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తమిళనాడులోని పసుంపొన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. “నేతాజీకి దేవర్ బలమైన మద్దతుదారుడు. ఆయన జీవితంలో అబద్ధం ఆడలేదు. ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ చెప్పారు. నేను అదే నమ్ముతాను” అని తెలిపారు.

News October 31, 2025

మంత్రివర్గంలోకి మరో ఇద్దరు!

image

TG: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఇవాళ మ.12.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. DEC తర్వాత మరో ఇద్దరు క్యాబినెట్‌లో చేరుతారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. దీనిపై CM రేవంత్ రెడ్డి, అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో BRSను గెలిపించడమే ఆ పార్టీ లక్ష్యమని మహేశ్ ఆరోపించారు.

News October 31, 2025

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ద్రాక్ష

image

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ద్రాక్ష పండు సాయపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. లండన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు అవి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుందని గుర్తించారు.