News July 26, 2024
భోజనంలో ఊరగాయ లేదని కేసు.. హోటల్‌కు రూ.35వేల ఫైన్

తమిళనాడులోని విల్లుపురంలో ఓ హోటల్ భోజనం పార్సిల్‌లో ఊరగాయ లేకపోవడంతో ఆరోఖ్యస్వామి అనే వ్యక్తి వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. అన్నంతోపాటు 11 రకాల ఐటమ్స్ ఇస్తామనడంతో అతను 25 భోజనాలకు ₹2వేలు చెల్లించాడు. తీరా ఓపెన్ చేస్తే ఊరగాయ కనిపించలేదు. హోటల్ యజమాని దురుసు సమాధానం ఇవ్వడంతో అతను కేసు వేశారు. దీంతో కోర్టు ₹35వేలతోపాటు పచ్చడికి ₹25 చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
Similar News
News October 16, 2025
క్రాస్ కంట్రీ స్కీయింగ్‌లో చరిత్ర సృష్టించిన భవానీ

క్రాస్ కంట్రీ స్కీయింగ్‌లో దేశం తరఫున మొదటి పతకాన్ని గెలుచుకొని TN భవాని రికార్డు సృష్టించారు. కర్ణాటకలోని కొడగుకు చెందిన భవానీ చిలీలో జరిగిన 5 కి.మీ ఇంటర్వెల్ స్టార్ట్ ఫ్రీ రేసులో 21:04.9 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని కాంస్యం సాధించారు. ట్రెక్కింగ్‌తో మొదలైన భవానీ ప్రయాణం ప్రస్తుతం స్కీయింగ్‌లో రికార్డులు సృష్టించేవరకు వచ్చింది. 2026 వింటర్ ఒలింపిక్సే లక్ష్యమని ఆమె చెబుతున్నారు. <<-se>>#InspiringWomen<<>>
News October 16, 2025
నవంబర్‌లో లండన్ పర్యటనకు CM చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో వచ్చేనెల 14, 15న జరగనున్న సీఐఐ సదస్సుకు రావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది.
News October 16, 2025
PIC OF THE DAY

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటో వైరలవుతోంది. PIC OF THE DAY అని పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా ‘నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.