News February 28, 2025
రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

TG: వరంగల్‌లో మామూనూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎయిర్ పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తవ్వగా మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కేంద్రం తాజా ఉత్తర్వులతో నిర్మాణ పనులు ముమ్మరం కానున్నాయి.
Similar News
News November 11, 2025
లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్‌కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.
News November 11, 2025
బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.


